హీరోయిన్ స్నానం చేసిన నీటితో సోప్, క్రేజీ మార్కెటింగ్

హాలీవుడ్ స్టార్ సిడ్నీ స్వీనీ (Euphoria, Anyone But You ఫేమ్) తాజాగా ఓ వైల్డ్ మార్కెటింగ్ స్టంట్‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఆమె డాక్టర్ స్క్వాచ్ (Dr. Squatch) అనే మెన్స్ నాచురల్ సోప్ బ్రాండ్‌తో కలిసి “సిడ్నీస్ బాత్‌వాటర్ బ్లిస్” అనే లిమిటెడ్ ఎడిషన్ సోప్‌ని లాంచ్ చేసింది. ట్విస్ట్ ఏంటంటే, ఈ సోప్‌లో సిడ్నీ స్నానం చేసిన నీళ్లు ఉన్నాయట! అవును, మీరు సరిగ్గానే చదివారు, ఈ క్రేజీ ఐడియా ఎలా వచ్చింది, ధర ఎంత, ఎక్కడ కొనాలో ఫుల్ డీటెయిల్స్ చూద్దాం!

బాత్‌వాటర్ సోప్ గోల ఏంటి?

సిడ్నీ స్వీనీ గత ఏడాది డాక్టర్ స్క్వాచ్‌తో చేసిన ఓ స్టీమీ బాత్‌టబ్ యాడ్ సూపర్ వైరల్ అయింది. ఆమె బాత్‌టబ్‌లో సోక్ అవుతూ “డర్టీ లిటిల్ బాయ్స్” అని కాల్ చేసిన యాడ్‌ చూసి, ఫ్యాన్స్ ఆమె బాత్‌వాటర్ కావాలని కామెంట్స్‌లో రచ్చ చేశారు. ఈ ఫన్నీ డిమాండ్‌ని సీరియస్‌గా తీసుకున్న సిడ్నీ, డాక్టర్ స్క్వాచ్‌తో కలిసి ఈ సోప్‌ని క్రియేట్ చేసింది. “ఫ్యాన్స్ బాత్‌వాటర్ అడుగుతున్నారు, మరి ఇదిగో, ఇచ్చేస్తున్నాం!” అని సిడ్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో జోక్ చేసింది. ఈ సోప్‌లో ఆమె యాడ్ షూట్‌లో ఉపయోగించిన బాత్‌వాటర్ డ్రాప్‌లతో పాటు ఎక్స్‌ఫోలియేటింగ్ శాండ్, పైన్ బార్క్ ఎక్స్‌ట్రాక్ట్, షియా బటర్ ఉన్నాయంట.

ధర, రిలీజ్ డేట్, ఎక్కడ కొనాలి?
పేరు: సిడ్నీస్ బాత్‌వాటర్ బ్లిస్
ధర: ఒక్క సోప్ బార్ $8 (దాదాపు ₹670)
రిలీజ్ డేట్: జూన్ 6, 2025 నుంచి సేల్ స్టార్ట్
ఎక్కడ కొనాలి: డాక్టర్ స్క్వాచ్ అధికారిక వెబ్‌సైట్ (www.drsquatch.com) లో
క్వాంటిటీ: కేవలం 5,000 బార్స్ మాత్రమే, సో ఫాస్ట్ సెల్‌అవుట్ ఖాయం!
ఎక్స్‌ట్రా: కొన్న బార్స్‌తో సిడ్నీ బాత్‌వాటర్ అని సర్టిఫికెట్ కూడా వస్తుందట

డాక్టర్ స్క్వాచ్ ఇన్‌స్టాగ్రామ్‌లో “వాంట్ టు టేక్ ఎ షవర్ విత్ సిడ్నీ స్వీనీ?” అని ఫన్నీ పోస్ట్ చేసి, ఈ సోప్‌ని “అవుట్‌డోర్స్ + సిడ్నీ బాత్‌టబ్” కాంబో అని ప్రమోట్ చేసింది. అంతేకాదు, 100 బార్స్‌ని ఫ్రీ గివ్‌అవే చేస్తున్నారు..

సిడ్నీ ఏమంది?

GQ ఇంటర్వ్యూలో సిడ్నీ ఈ ఐడియా గురించి మాట్లాడుతూ, “ఫ్యాన్స్ ఎప్పుడూ నా బాత్‌వాటర్ గురించి జోక్ చేస్తుంటారు. నేను మొదట ఈ బాత్‌వాటర్ హైప్ గురించి అంతగా తెలీదు, కానీ కామెంట్స్ చూసాక అర్థమైంది!” అని చెప్పింది. సాల్ట్‌బర్న్ సినిమాలోని బాత్‌వాటర్ సీన్ (బారీ కీగన్ క్యారెక్టర్ బాత్‌వాటర్ తాగే సీన్) ఈ ఐడియాకి కాటలిస్ట్ అని, ఇది ఫ్యాన్స్‌తో కనెక్ట్ అయ్యే కూల్ వే అని అన్నది. “ఇది ఫన్, ఫుల్-సర్కిల్ మూమెంట్. ఫ్యాన్స్‌కి వాళ్లు కోరుకున్నది ఇవ్వడంతో పాటు, నాచురల్ సోప్స్ యూజ్ చేయమని ఎంకరేజ్ చేస్తోంది!” అని సిడ్నీ సూపర్ ఎక్సైటెడ్‌గా చెప్పింది. ఆమె ఈ సోప్‌ని తన షవర్‌లో యూజ్ చేస్తున్నానని కూడా రివీల్ చేసింది.

సోషల్ మీడియా రియాక్షన్ :ఈ సోప్ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో ఫుల్ రచ్చ చేసింది. యూట్యూబర్ MrBeastకి ఓ ఫ్యాన్, “నీవు నాకు ఈ సోప్ కొనివ్వు!” అని రిక్వెస్ట్ చేయగా, అతను “స్టాప్ అస్కింగ్!” అని ఫన్నీగా రిప్లై చేశాడు. కొందరు ఫ్యాన్స్ ఈ ఐడియాని “సూపర్ క్రియేటివ్, సిడ్నీ ఫ్యాన్ కల్చర్‌ని ఓన్ చేసింది!” అని పొగిడారు. కానీ, కొందరు “ఇది గ్రాస్, ఫ్యాన్స్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేసే స్టంట్!” అని క్రిటిసైజ్ చేశారు. ఒక X యూజర్, “ఇది హ్యూమిలియేషన్ రిచువల్, కస్టమర్స్‌ని డీమీన్ చేస్తోంది!” అని రాశాడు. ఇంకొకరు, “ఈ సోప్ ఎడిబుల్‌నా?” అని జోక్ చేశారు.

బెల్లె డెల్ఫిన్ కనెక్షన్:
ఈ బాత్‌వాటర్ ఐడియా కొత్తది కాదు. 2019లో అడల్ట్ కంటెంట్ క్రియేటర్ బెల్లె డెల్ఫిన్ తన బాత్‌వాటర్‌ని $30కి బాటిల్స్‌లో సేల్ చేసి సంచలనం సృష్టించింది. సిడ్నీ ఈ ఐడియాని అడాప్ట్ చేసి, దాన్ని సోప్ ఫార్మాట్‌లో తీసుకొచ్చిందని నెటిజన్స్ అంటున్నారు.