
సినీ స్టార్స్ చుట్టూ రూమర్స్ తిరగడం సర్వసాధారణం, కానీ కొన్ని గాసిప్స్ వింటే నవ్వొస్తాయి, మరికొన్ని కోపం తెపిస్తాయి ! హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గురించి వచ్చిన టాప్ క్రేజీ రూమర్‌ని షేర్ చేసి, దాని వాళ్ళ తమ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారో చెప్పింది. ఆ రూమర్ ఏంటంటే? హైదరాబాద్‌లో ఆమె ఇల్లు ఎవరో “గిఫ్ట్” ఇచ్చారని! ఈ గాసిప్ విని రకుల్ డాడీ అగ్గిమీద గుగ్గిలం అయ్యారట!
“ఇల్లు గిఫ్ట్? డాడీకి కోపం తెప్పించిన రూమర్!”
రకుల్ హైదరాబాద్‌లో ఓ స్టైలిష్ ఇల్లు కొన్న సంగతి అందరికీ తెలుసు. కానీ, ఈ ఇల్లు ఆమెకు ఎవరో ఒక పొలిటిషన్ గిఫ్ట్‌గా ఇచ్చారని సోషల్ మీడియాలో ఓ గాసిప్ తెగ వైరల్ అయ్యింది. ఈ రూమర్ వినగానే రకుల్ తండ్రి రాజేందర్ సింగ్ ఫుల్ ఫైర్ అయిపోయారట! రకుల్ ఇంటర్వ్యూలో ఆ గాసిప్ గుర్తు చేస్తూ, “ఆ రూమర్ నా డాడీని తెగ కోపం తెప్పించింది, నా ఇంటి పేపర్‌వర్క్ దగ్గర నుండి ఇంటి పనులు మొత్తం ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. ‘ఇది నా కూతురు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న ఇల్లు!’ అని గట్టిగా సమాధానం చెప్పాలనుకున్నారట!”. అయితే రకుల్ మాత్రం కూల్‌గా… “ఇలాంటి చిన్న చిన్న పోర్టల్స్‌కి సమాధానం ఇవ్వడం టైమ్ వేస్ట్ డాడీ అనిచెప్పి ఊరుకోపెట్టిందంట”.
రకుల్ తన గురించి వచ్చే రూమర్స్, ట్రోల్స్‌పై ఫుల్ చిల్ మోడ్‌లో ఉంటుందట. “ఈ గాసిప్స్, ట్రోల్స్ నన్ను పెద్దగా ఎఫెక్ట్ చేయవు. అందరూ నన్ను లవ్ చేయాలని నేను ఆశించను!” అని స్ట్రెయిట్‌గా చెప్పేసింది. ఆమె మంత్రం ఒక్కటే – “నేను నిజాయితీగా ఉంటా, నా వర్క్‌లో 100% ఇస్తా. రూమర్స్ నా కంట్రోల్లో లేవు, సో వాటి గురించి బుర్ర బద్దలు కొట్టుకోను!” నిర్మాణాత్మక విమర్శ అయితే ఓకే, కానీ వ్యక్తిగత దూషణలు, లుక్స్‌పై కామెంట్స్ అయితే “స్టుపిడ్!” అని రకుల్ ఒక్క మాటలో తేల్చేసింది.