
కమల్ హాసన్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తన కొత్త సినిమా థగ్ లైఫ్ ప్రమోషన్ ఈవెంట్‌లో కన్నడ భాష గురించి చేసిన కామెంట్స్ వల్ల కర్ణాటకలో రచ్చ మొదలైంది. చెన్నైలో జరిగిన ఆడియో లాంచ్‌లో కమల్, “కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది” అని అనడంతో కన్నడిగులు ఫుల్ ఫైర్ అయ్యారు. కమల్ హాసన్ క్షమాపణ కోరకపోతే థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో బాన్ చేస్తామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFC) ప్రకటించింది.
ఈ గొడవ మీద కమల్ హాసన్ తన స్టైల్‌లో స్పందించాడు. “నేను తప్పు చేస్తే కషమాపణ చెప్తా, కానీ తప్పు లేకపోతే సారీ చెప్పను. ఇది నా లైఫ్‌స్టైల్, దీన్ని ఎవరూ మార్చలేరు!” అని గట్టిగా చెప్పాడు. ఈ కామెంట్‌ని తాను “తమిళం మీద ప్రేమతో, హిస్టారియన్స్ చెప్పిన బేస్‌తో” చెప్పానని, ఈ విషయాన్నీ రాజకీయం చెయ్యొద్దని. “ఇండియా డెమోక్రటిక్ దేశం, నేను లా అండ్ జస్టిస్‌ని బిలీవ్ చేస్తా. నా ప్రేమ నిజమైంది, అది ఎప్పుడూ గెలుస్తుంది!” అని తిరువనంతపురంలో మీడియాతో అన్నాడు. బెదిరింపుల గురించి అడిగితే, “నన్ను ఇంతకు ముందు కూడా బెదిరించారు, నో టెన్షన్!” అని కూల్‌గా సమాధానం ఇచ్చాడు.
#WATCH | Chennai: "It is a democracy. I believe in the law and justice. My love for Karnataka, Andhra Pradesh and Kerala is true. Nobody will suspect it except for those who have an agenda. I've been threatened earlier too, and if I am wrong, I would apologise, if I'm not, I… pic.twitter.com/ZtNMhPYETq
— ANI (@ANI) May 30, 2025
తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కొందరు కమల్‌కి సపోర్ట్‌గా నిలిచారు. “తమిళం, కన్నడం రెండూ ద్రావిడ భాషలు, ఈ గొడవ అనవసరం” అని కొందరు అన్నారు. కానీ, కర్ణాటకలో ఈ ఇష్యూ ఇంకా హాట్ గానే ఉంది. బెంగళూరులో కమల్ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఫైల్ అయింది. మణిరత్నం డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ లో కమల్ హాసన్, త్రిష, సిలంబరసన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 5, 2025న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. కానీ, కర్ణాటకలో ఈ వివాదం వల్ల సినిమా రిలీజ్ ఆగిపోతుందా అనే డౌట్ ఉంది. కమల్ తన స్టాండ్‌లో గట్టిగా ఉంటూ, “తప్పు లేనప్పుడు సారీ ఎందుకు?” అని క్లియర్ చేశాడు. కానీ, ప్రో-కన్నడ గ్రూప్స్, పొలిటీషియన్స్ ఈ ఇష్యూని వదిలేలా లేరు. థగ్ లైఫ్ సినిమా రిలీజ్ పై ఈ వివాదం ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందేమో చూడాలి.