బోల్డ్ సీన్స్‌తో విసుగొచ్చింది, గ్లామర్‌కి గుడ్‌బై! నందిని రాయ్ సంచలనం

బిగ్ బాస్ ఫేమ్, హాట్ బ్యూటీ నందిని రాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. గ్లామర్ రోల్స్, బోల్డ్ సీన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు, ఇప్పుడు అలాంటి పాత్రలతో బోర్ కొట్టేసిందని షాకింగ్ విషయం చెప్పింది.

“బోల్డ్ సీన్స్‌తో బోర్, ఇక చాలు!”

తాజా ఇంటర్వ్యూలో నందిని రాయ్… “నాకు బోల్డ్ రోల్స్, స్కిన్ షో చేయడం ఫుల్ విసుగొచ్చేసింది. 100% బోర్ కొట్టేసింది!” అని క్లియర్‌గా చెప్పేసింది. ఇకపై సంప్రదాయమైన, ఛాలెంజింగ్ పాత్రల్లో కనిపించాలని ఫిక్స్ అయినట్టు తెలిపింది. సమంత, నయనతార లాంటి స్టార్స్ చేసే సీరియస్ రోల్స్ తనకు స్ఫూర్తి అని, అలాంటి క్యారెక్టర్స్‌తో తన టాలెంట్‌ని నిరూపించుకోవాలని ఉందని చెప్పింది. “మొదట్లో గ్లామర్ రోల్స్ చేశా, డైరెక్టర్లు నన్ను అలాంటి పాత్రలకే ఫిక్స్ చేసేస్తున్నారని. కానీ, నేను డి-గ్లామర్, సంప్రదాయ రోల్స్ కూడా చెయ్యగలను!” అని కాన్ఫిడెంట్‌గా చెప్పింది. అందుకే త్వరలో సంప్రదాయ లుక్‌లో ఓ కూల్ ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నానని కూడా రివీల్ చేసింది.

నందిని తన గత సినిమాల గురించి మాట్లాడుతూ, “ఒక సినిమా చేసినందుకు ఫుల్ రిగ్రెట్ అయ్యా. కొన్ని సీన్స్ సెన్సువల్‌గా ఉండాల్సింది పోయి, వల్గారిటీ లెవెల్‌కి వెళ్లిపోయాయి!” అని ఓపెన్ అయింది. ఇంటిమేట్ సీన్స్ షూట్ చేసేటప్పుడు ఫుల్ నెర్వస్‌గా ఉంటుందని, డైరెక్టర్లు కంఫర్ట్‌గా ఫీల్ అయ్యేలా చూసినా అది ఈజీ టాస్క్ కాదని చెప్పింది. “ఆ సినిమా నా లాస్ట్ బోల్డ్ రోల్. ఇకపై అలాంటి పాత్రల్లో కనిపించను!” అని ఖచ్చితంగా స్పష్టం చేసింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఫ్యాన్స్‌ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి.

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ, “సౌత్ ఇండస్ట్రీ నాకు సూపర్ సేఫ్. నాకు ఎప్పుడూ అలాంటి చెడు అనుభవాలు ఎదురు కాలేదు!” అని నందిని క్లారిటీ ఇచ్చింది.