Rashmika Mandanna Net Worth: రష్మిక ఆస్థి ఎన్ని కొట్లో తెలిస్తే షాక్ అవుతారు

Rashmika Mandanna Net Worth: భారత సినీ పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కన్నడ నటి రష్మిక మందానా, నేషనల్ క్రష్‌గా యువత హృదయాలను కొల్లగొడుతూ, టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. గత ఏడాది చివర్లో విడుదలైన ‘పుష్ప 2’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న రష్మిక, శ్రీవల్లి పాత్రలో గ్లామర్‌తో పాటు అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఏడాది కూడా ఆమె కెరీర్‌లో ప్రత్యేకమైనదిగా నిలిచింది. మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘చావా’ చిత్రంలో యేసుబాయి పాత్రలో నటించి, విక్కీ కౌశల్‌తో సమానంగా తన నటనా ప్రతిభను చాటి, చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది.

ప్రస్తుతం అన్ని భాషల సినీ పరిశ్రమల్లోనూ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మికకు ఇన్‌స్టాగ్రామ్‌లో 45 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలకు ఆమెనే మొదటి ఎంపికగా పరిగణిస్తున్నారు. వరుస అవకాశాలు, భారీ విజయాలతో రష్మిక ఆస్తులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా కొనసాగుతున్న రష్మిక నికర ఆస్తుల విలువ రూ.66 కోట్లుగా ఉందని ఫోర్బ్స్ రిపోర్ట్ వెల్లడించింది. 28 ఏళ్ల వయసున్న ఈ నటి, ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.4-8 కోట్ల మధ్య రెమ్యునరేషన్ అందుకుంటుండగా, ‘పుష్ప 2’ కోసం రూ.10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలు, ఎండార్స్‌మెంట్స్, ఇన్‌స్టాగ్రామ్ ప్రమోషన్ల ద్వారా రష్మిక భారీగా సంపాదిస్తోంది. పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూనే, ప్లం వంటి బ్రాండ్‌లలో పెట్టుబడులు పెట్టి ఆదాయాన్ని మరింత పెంచుకుంటోంది. ఆమె ఆస్తుల్లో బెంగళూరులో రూ.8 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాతో పాటు, హైదరాబాద్, గోవా, ముంబయి, కూర్గ్ ప్రాంతాల్లో భారీ ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. లగ్జరీ కార్ల అభిమానిగా గుర్తింపు పొందిన రష్మిక సొంతం చేసుకున్న వాహనాల్లో ఆడి క్యూ3, రేంజ్ రోవర్ స్పోర్ట్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా, మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్ వంటివి ఉన్నాయి.

రష్మిక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే, ‘కిరిక్ పార్టీ’ చిత్రంలో సహనటుడు రక్షిత్ శెట్టితో ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగినప్పటికీ, 2018లో వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. ఆ తర్వాత ‘ఛలో’ చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన రష్మిక, కెరీర్‌లో వేగంగా ఎదుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండతో డేటింగ్‌లో ఉన్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కలిసి నటించారు. అధికారికంగా ధృవీకరణ లేనప్పటికీ, విహార యాత్రలు, జిమ్ వర్కౌట్స్, పండగలు, కుటుంబ కార్యక్రమాల్లో వీరు కలిసి కనిపిస్తున్నారు.

ప్రస్తుతం రష్మిక తెలుగులో ‘కుబేర’ చిత్రంలో నటిస్తోంది. అక్కినేని నాగార్జున, ధనుష్ నటిస్తున్న ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక కెరీర్, సంపాదన, ఆస్తుల వివరాలు ఆమె ప్రజాదరణ, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.