జాన్వీ లైక్ చేసిన రీల్‌తో సోషల్ మీడియాలో గోల..

బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇప్పుడు ఓ హాట్ టాపిక్‌లో ఇరుక్కుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ చేసిన ఒక రీల్ సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది. ఈ రీల్‌లో బాలీవుడ్ లెజెండ్స్ మాధురీ డిక్షిత్, శ్రీదేవిలను కంపేర్ చేస్తూ కాస్త వివాదాస్పదంగా కాప్షన్ కామెంట్ రాశారు. ఈ రీల్‌ని జాన్వీ లైక్ చేయడంతో నెటిజన్లు ఫుల్ జోష్‌లో డిబేట్, ట్రోల్ల్స్ స్టార్ట్ చేశారు.

ఈ వైరల్ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో రెండు స్క్రీన్స్‌లో వీడియోలు ప్లే అవుతాయి. ఒకవైపు మాధురీ డిక్షిత్ నటించిన బీటా సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ “ధక్ ధక్ కర్నే లగా” డాన్స్ సీన్. దానిపై టెక్స్ట్‌లో “మాధురీ ఒక వల్గర్ స్టెప్‌తో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ గెలిచింది, ఏం చేయకుండానే” అని రాసుంది. మరోవైపు శ్రీదేవి నటించిన ఖుదా గవాహ్ సినిమాలో ఆమె డ్యూయల్ రోల్ పెర్ఫార్మెన్స్ చూపిస్తూ, “శ్రీదేవి ల్యాండ్‌మార్క్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినా అవార్డ్‌లో ఇగ్నోర్ చేశారు” అని టెక్స్ట్ ఉంది. ఈ రీల్‌ని జాన్వీ లైక్ చేయడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది, దీంతో రెడ్డిట్‌లో ఈ విషయం ఫుల్ వైరల్ అయిపోయింది.

జాన్వీ ఈ రీల్‌ని లైక్ చేసిన స్క్రీన్‌షాట్ రెడ్డిట్‌లో సర్కులేట్ అవుతోంది. నెటిజన్లు దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు “ఇది జాన్వీ ఇంటెన్షనల్‌గా లైక్ చేసిందా? లేక ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ గోలా?” అని సరదాగా కామెంట్స్ వేశారు. ఒక యూజర్ రాస్తూ, “జాన్వీ కూడా కోహ్లీ, తమన్నా గ్యాంగ్‌లా యాక్సిడెంటల్ లైక్‌లు బ్యాచ్ ?” అని జోక్ చేశాడు. మరో యూజర్ సీరియస్‌గా, “బీటాలో మాధురీ పెర్ఫార్మెన్స్ అద్భుతం. ఆమె అవార్డ్ గెలవడం కేవలం డాన్స్ కోసం కాదు, యాక్టింగ్ కోసం కూడా!” అని సపోర్ట్ చేశాడు.

ఈ రీల్‌ని జాన్వీ ఇంటెన్షనల్‌గా లైక్ చేసిందా లేక యాక్సిడెంట్‌గా అయిందా అనే దానిపై ఆమె నుంచి ఇంకా ఎలాంటి స్టేట్‌మెంట్ రాలేదు. కానీ, సోషల్ మీడియాలో ఈ ఇష్యూ ఫుల్ హైప్ అవుతోంది. శ్రీదేవి ఫ్యాన్స్ ఈ రీల్‌ని సపోర్ట్ చేస్తుంటే, మాధురీ ఫ్యాన్స్ ఆమెపై వచ్చిన కామెంట్స్‌ని తప్పుబడుతున్నారు. జాన్వీ నుంచి ఈ ఇష్యూపై క్లారిటీ వస్తుందా? లేక ఈ గోల ఇలాగే సాగుతుందా? వేచిచూడాలి.

Janhvi likes post shading madhuri and praising sridevi
byu/Ok_Pie_551 inBollyBlindsNGossip