ప్రభాస్ ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వి సీరియస్

ప్రభాస్ ఫౌజీ మూవీ హీరోయిన్ ఇమాన్వి గురించి రీసెంట్‌గా సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె పాకిస్తాన్ మిలిటరీతో లింక్ ఉందని, ఆమె ఐడెంటిటీ గురించి కొందరు ఆన్‌లైన్‌లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఈ ఆరోపణలు చూసి చాలా హర్ట్ అయిన ఇమాన్వి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టి తన గురించి, తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి క్లియర్‌గా చెప్పింది. ఈ రూమర్స్ ఎందుకు వచ్చాయి, ఇమాన్వి ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం!

రీసెంట్‌గా కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన టెర్రర్ అటాక్ తర్వాత, ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వి గురించి సోషల్ మీడియాలో ఫేక్ రూమర్స్ వైరల్ అయ్యాయి. ఇమాన్వి తండ్రి పాకిస్తాన్ మిలిటరీలో మేజర్‌గా ఉన్నాడని, ఆమెకు పాకిస్తాన్‌తో లింక్ ఉందని కొందరు ఆరోపణలు చేశారు. ఈ రూమర్స్ చూసి ఇమాన్వి చాలా హర్ట్ అయింది. కొందరు “ఆమెను ప్రభాస్ సినిమా నుంచి తీసేయాలి” అని డిమాండ్ కూడా చేశారు. ఈ ఫేక్ న్యూస్ కొన్ని గంటల్లోనే వైరల్ అయిపోయింది.

ఇమాన్వి తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసింది ఏంటంటే—తాను ప్రౌడ్ ఇండియన్ అమెరికన్ అని, లాస్ ఏంజిల్స్‌లో పుట్టానని చెప్పింది. ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లి అక్కడ సిటిజన్స్ అయ్యారట. ఇమాన్వి అమెరికాలో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి, ఆర్టిస్ట్, డాన్సర్, కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఛాన్స్ వచ్చి ఇక్కడ సినిమాలు చేస్తోంది. “నాకు ఇండియన్ కల్చర్ బ్లడ్‌లో ఉంది, నేను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడతాను. పాకిస్తాన్ మిలిటరీతో నాకు ఎలాంటి కనెక్షన్ లేదు, ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నవాళ్లు సిగ్గుపడాలి” అని ఇమాన్వి సీరియస్‌గా చెప్పింది.

నాకైతే ఇమాన్వి మీద ఇలాంటి ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ చేయడం చాలా తప్పు అనిపిస్తుంది. ఆమె ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. అలాంటిది ఇలాంటి నీచమైన ఆరోపణలు చేస్తే ఎవరైనా హర్ట్ అవుతారు కదా!