సుర్వీన్ చావ్లా షాకింగ్ రివీల్: “డైరెక్టర్ కిస్ చేయడానికి ట్రై చేశాడు!”

బాలీవుడ్ స్టార్ సుర్వీన్ చావ్లా తాజా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో తను ఫేస్ చేసిన కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి ఓపెన్ అయిన ఈ అమ్మడు, ఓ డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అది కూడా తన పెళ్లి గురించి మాట్లాడిన కొద్ది నిమిషాల్లోనే అని సంచలన విషయం బయటపెట్టింది.

ముంబైలో జరిగిన షాకింగ్ ఘటన
హౌటర్‌ఫ్లై (Hauterrfly)లోని ది మేల్ ఫెమినిస్ట్ పాడ్‌కాస్ట్‌లో సుర్వీన్ చావ్లా తన జీవితంలో ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి మాట్లాడింది. ముంబైలోని వీరా దేశాయ్ రోడ్‌లో జరిగిన ఓ సంఘటనను షేర్ చేస్తూ, “ఒక డైరెక్టర్‌తో అతని ఆఫీస్ క్యాబిన్‌లో మీటింగ్ జరిగింది. అది నా పెళ్లి తర్వాత. మీటింగ్‌లో నా భర్త గురించి, మా మ్యారేజ్ ఎలా సాగుతోంది, అతను ఏం చేస్తాడు అని మాట్లాడాం. మీటింగ్ అయిపోయాక, అతను నన్ను గేట్ వరకు సీ-ఆఫ్ చేయడానికి వచ్చాడు. అక్కడ ఆ డైరెక్టర్ నన్ను కిస్ చేయడానికి ట్రై చేశాడు! నేను షాక్ అయ్యి అతన్ని వెనక్కి తోసి, ‘ఏంటిది?’ అని అడిగి అక్కడ్నుంచి వెళ్లిపోయా!” అని చెప్పింది. ఈ ఘటన తనను బాగా కలిచివేసిందని, అలాంటి అనుభవాలు తన కెరీర్‌లో ఒకటి కాదు, చాలాసార్లు ఎదురయ్యాయని రివీల్ చేసింది.

సౌత్ ఇండస్ట్రీలోనూ చేదు అనుభవం
అంతే కాదు, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా సుర్వీన్ సిమిలర్ ఇన్సిడెంట్ ఫేస్ చేసిందట. ఓ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్, ఆమెతో షూటింగ్ సమయంలో “సన్నిహితంగా” ఉండాలని కోరాడట. ఆ డైరెక్టర్ హిందీ, ఇంగ్లీష్ మాట్లాడలేడు కాబట్టి, ఓ మధ్యవర్తి ద్వారా ఈ విషయం సుర్వీన్‌కి చెప్పాడు. “నేను 12 గంటల పాటు స్క్రీన్ టెస్ట్ చేశా, తమిళ మోనోలాగ్ నేర్చుకున్నా. కానీ, ఆ డైరెక్టర్ నాతో సన్నిహితంగా ఉండాలని అడిగాడు. నేను స్ట్రెయిట్‌గా ‘సారీ, రాంగ్ డోర్ నాక్ చేశావ్, నేను పని కోసం ఇలాంటి బేరసారాలు చేయను!’ అని చెప్పేశా!” అని సుర్వీన్ రెవీల్ చేసింది.

బాడీ షేమింగ్‌పైనా ఫైర్!

కాస్టింగ్ కౌచ్‌తో పాటు, సుర్వీన్ బాడీ షేమింగ్ అనుభవాల గురించి కూడా మాట్లాడింది. సౌత్ ఇండస్ట్రీలో ఆమెను “నీవు చాలా సన్నగా ఉన్నావ్, బరువు పెరగాలి” అని అన్నారట. “నీ వెయిస్ట్ సైజ్, చెస్ట్ సైజ్ ఇలా ఉండాలి” అని పారామీటర్స్ సెట్ చేశారని, అలాంటి వాటిని ఆమె తీవ్రంగా ఖండించింది. “మహిళలను ఇలాంటి పారామీటర్స్‌తో జడ్జ్ చేయడం రాంగ్!” అని గట్టిగా చెప్పింది.

సుర్వీన్ ఈ అనుభవాలను ఓపెన్‌గా షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. “సుర్వీన్ గట్స్ సూపర్! ఇండస్ట్రీలోని డార్క్ సైడ్‌ని బయటపెట్టడం గ్రేట్!” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. “ఇలాంటి అనుభవాలు ఎంతమంది యాక్టర్స్ ఫేస్ చేస్తారో!” అని మరొకరు రాశారు. కొందరు ఆమెను సపోర్ట్ చేస్తూ, ఇండస్ట్రీలో ఇలాంటి ప్రవర్తనను ఖండించాలని కోరుతున్నారు.